Header Banner

ఏపీ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ-క్యాబినెట్ సమావేశం! పలు కీలక నిర్ణయాలు ఇవే..!

  Thu May 08, 2025 18:54        Politics

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గురువారం సచివాలయంలో జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు.

ఉగ్రవాదంపై ప్రధానమంత్రికి మద్దతు:

ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్‌కు మంత్రి మండలి సంఘీభావాన్ని ప్రకటించింది.  సిందూర్‌ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్‌ చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

అమృత్-2.0 పరిష్కారం:

రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో 281 పనులు కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (CHAM) కింద చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

జలహారతి కార్పొరేషన్:

జలవనరుల శాఖలో “జలహారతి కార్పొరేషన్” పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలు:

కర్నూలు జిల్లా బి. తండ్రపాడు గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు LNG HUB స్థాపనకు భూమి కేటాయింపుకు ఆమోదం. నెల్లూరు జిల్లాలో ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతో భూ సేకరణ నిర్ణయం.

TTDలో మార్పులు:

టీటీడీ ఐటి విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి)ని జనరల్ మేనేజర్ (ఐటి)గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం.

పర్యాటక రంగ ప్రోత్సాహం:

పర్యాటక రంగంలో ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCabinet #ChandrababuNaidu #KeyDecisions #ECabinetMeeting #AndhraPradesh #DevelopmentAgenda #OperationSindhoor